AP News :టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై లోకేశ్ హాట్ కామెంట్స్
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం రోజుకోమలుపు తిప్పుతోంది. పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం చెప్తుంటే..ప్రతిపక్ష పార్టీలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు సైతం ఏపీ ప్రభుత్వంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత నారా లోకేశ్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి తీవ్ర […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ అంశం రోజుకోమలుపు తిప్పుతోంది. పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రభుత్వం చెప్తుంటే..ప్రతిపక్ష పార్టీలు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు సైతం ఏపీ ప్రభుత్వంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ నేత నారా లోకేశ్ టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలంటూ పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. తాజాగా జగన్ ప్రభుత్వంపై నారా లోకేశ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో పరీక్షలు రద్దు చేయని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. విద్యార్థుల ప్రాణాలు కాపాడేందుకే పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే టీడీపీ తరపున పోరాటం చేస్తామన్నారు. పరీక్షలు నిర్వహణవల్ల 80 లక్షల మందికి ప్రమాదం పొంచి ఉందన్నారు. పరీక్షల నిర్వహణ ఓ సూపర్ స్ప్రెడర్ కార్యక్రమంలాంటిదని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజకీయ హత్యలకు తెరలేపారని ఆరోపించారు. నీళ్లు పారే రాయలసీమలో మళ్లీ రక్తం పారటానికి జగనే కారణమన్నారు. అలాగే ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ ఓ ఫేక్ క్యాలండెర్‌గా అభివర్ణించారు. అప్పట్లో 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు కేవలం 10వేల పోస్టులకే క్యాలండర్ ఇవ్వడం దుర్మార్గమని లోకేశ్ విమర్శించారు.