ప్రతీ రైతుకూ రూ.25వేల పరిహారం ఇవ్వాలి

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో గతేడాది రూ.2వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం రూ.25లక్షలు పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ మంత్రి నారా లోకేష్​ విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ గ్రామంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు. 15నెలల నుంచి రైతులకు ఇన్​పుట్ ​సబ్సిడీ, పంటల బీమా సొమ్ము ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకూ రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే […]

Update: 2020-10-23 11:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: అనంతపురం జిల్లాలో గతేడాది రూ.2వేల కోట్ల పంట నష్టం జరిగితే కేవలం రూ.25లక్షలు పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకున్నారని మాజీ మంత్రి నారా లోకేష్​ విమర్శించారు. శుక్రవారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిడికొండ గ్రామంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలించారు. 15నెలల నుంచి రైతులకు ఇన్​పుట్ ​సబ్సిడీ, పంటల బీమా సొమ్ము ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయిన ప్రతీ రైతుకూ రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. పంపుసెట్లకు మీటర్లు బిగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు వ్యతిరేక విధానాలు అమలుచేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రైతులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News