జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయి: లోకేశ్
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని, లేకుంటే జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయని టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ హెచ్చరించారు. సోమవారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో పర్యటించిన లోకేశ్.. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత పురంశెట్టి అంకులు కుటుంబాన్ని పరామర్శించారు. అంకులు భార్య పున్నమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షన్ నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని మండిపడ్డారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాక్షన్ రాజకీయాలకు ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని, లేకుంటే జరగబోయే పరిణామాలు దారుణంగా ఉంటాయని టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ హెచ్చరించారు. సోమవారం గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో పర్యటించిన లోకేశ్.. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత పురంశెట్టి అంకులు కుటుంబాన్ని పరామర్శించారు. అంకులు భార్య పున్నమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫ్యాక్షన్ నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని మండిపడ్డారు. అంకులును కాపు మహేశ్‌రెడ్డి, దాచేపల్లి ఎస్ఐ హత్య చేయించారని, ఆ విషయం ఇక్కడి ప్రజలకు తెలసని ఆరోపించారు.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని, ప్రజలకు కనీస భద్రత లేదని విమర్శించిన లోకేశ్.. అంకులు హత్య కేసులో దాచేపల్లి ఎస్ఐ పేరు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఎస్ఐ స్వయంగా ఫోన్ చేసి అంకులును పిలిపించారని మండిపడ్డారు.