ఏపీలో మహిళలు భయంతో బతుకుతున్నారు: నారా లోకేశ్
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కరువైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహిళలపై రాష్ట్రంలో రోజుకో దాడి జరుగుతుందని ఆరోపించారు. గుంటూరులో మెున్న ప్రేమోన్మాది కత్తివేటుకు రమ్య నేలకొరిగితే.. నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి పశువాంఛలకు బలయ్యిందన్నారు. నేడు విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టారని తెలిపారు. మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా.. దున్నపోతు ప్రభుత్వంలో స్పందనలేదని ట్విటర్ వేదికగా […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత కరువైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మహిళలపై రాష్ట్రంలో రోజుకో దాడి జరుగుతుందని ఆరోపించారు. గుంటూరులో మెున్న ప్రేమోన్మాది కత్తివేటుకు రమ్య నేలకొరిగితే.. నిన్న గుంటూరు జిల్లా రాజుపాలెంలో చిన్నారి పశువాంఛలకు బలయ్యిందన్నారు. నేడు విజయనగరం జిల్లా చౌడవాడలో ఉన్మాది పెట్రోల్ పోసి యువతిని తగులబెట్టారని తెలిపారు. మూడు రోజుల్లో ఆడపిల్లలపై మూడు అమానవీయ ఘటనలు జరిగినా.. దున్నపోతు ప్రభుత్వంలో స్పందనలేదని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘జగన్ మీ ఇంట్లో మహిళలకు రక్షణలేదూ ..మీ ఇంటి పక్క నివసించేవారూ అత్యాచారానికి గురయ్యారు. మీ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరికీ భద్రతలేని భయం భయం బతుకులైపోయాయి. ఇంకా, లేని ఆ దిశ చట్టం..రక్షించలేని దిశ యాప్ పేరుతో ప్రచారం చేసుకోకండి.. పబ్లిసిటీయే సిగ్గుపడుతుంది’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిందితులను పట్టుకొని శిక్షించడంలో సీరియస్‌గా వ్యవహరిస్తే రోజుకొకడు ఇలా మృగంలా ప్రవర్తించడని తెలిపారు. బాధితుల్ని బాధిస్తూ, నిందితుల్ని రక్షించేందుకు ఈ ప్రభుత్వం పనిచేయడం వల్లే క్రిమినల్స్ చెలరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఆడపిల్లల ఉసురు తగిలితే ఈ రాష్ట్రానికి ఏ మాత్రం మంచిదికాదని లోకేశ్ హితవు పలికారు.