మరో టోర్నీ నుంచి తప్పుకున్న ఒసాకా

దిశ, స్పోర్ట్స్: మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వరల్డ్ నెంబర్ 2 మహిళల సింగిల్స్ ర్యాంకర్ నయోమీ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మేజర్ టోర్నీ నుంచి కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. బెర్లిన్ టోర్నీలో తాను పాల్గొనడం లేదని ఒసాకా సమాచారం ఇచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నందుకు ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో విజయయం సాధించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనలేదు. దీంతో ఫ్రెంచ్ టెన్నిస్ […]

Update: 2021-06-07 10:29 GMT

దిశ, స్పోర్ట్స్: మానసిక ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వరల్డ్ నెంబర్ 2 మహిళల సింగిల్స్ ర్యాంకర్ నయోమీ తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మేజర్ టోర్నీ నుంచి కూడా వైదొలగుతున్నట్లు ప్రకటించింది. బెర్లిన్ టోర్నీలో తాను పాల్గొనడం లేదని ఒసాకా సమాచారం ఇచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మానసికంగా తీవ్ర ఆందోళనలో ఉన్నందుకు ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో విజయయం సాధించిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొనలేదు. దీంతో ఫ్రెంచ్ టెన్నిస్ సమాఖ్య 15 వేల డాలర్ల జరిమానా విధించింది.

ఇకపై సమావేశాల్లో పాల్గొనక పోతే గ్రాండ్‌స్లామ్స్ నుంచి బహిష్కరిస్తామని కూడా ఇతర టోర్నీ నిర్వాహకులతో కలపి నోటీసులు ఇచ్చారు. దీంతో నయోమీ ఒసాకా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్, జులైలో జరగనున్న ఒలింపిక్స్‌లో కూడా ఒసాకా పాల్గొనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి.

Tags:    

Similar News