నమ్రత సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దేశ ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత శుభ్రతపై సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు […]

Update: 2020-03-20 00:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు, థియేటర్లు, మాల్స్ మూతపడ్డాయి. సినిమా షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దేశ ప్రజలు దాదాపు ఇళ్లకే పరిమితమై కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత శుభ్రతపై సినీ ప్రముఖులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రవేశపెట్టిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్… చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వివరించారు. సరైన క్రమంలో చేతులను కడుక్కోవడం ద్వారా కోవిడ్ 19 బారిన పడకుండా ఉండగలమని తెలిపారు. 20-40 సెకన్ల పాటు చేతులను శుభ్రపరిచి సూక్ష్మజీవులను నాశనం చేయాలన్నారు. ఈ సమయంలో అందరూ బాధ్యతగా ఉండాలని… అందరం కలిసి కరోనా వైరస్‌ను పారదోలుదామని పిలుపునిచ్చారు నమ్రత. మరింత సమాచారం కోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైట్‌ను ఫాలో కావాలని సూచించారు.

Tags:    

Similar News