కంటైన్‌మెంట్ ఏరియాల్లో వివరాలు సేకరించాలి

దిశ, నల్లగొండ: కొవిడ్ – 19 వ్యాప్తిని అరికట్టేందుకు విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది కంటైన్‌మెంట్ ఏరియా పరిధిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలోని కంటైన్‌మెంట్ ఏరియాలో ఆదివారం పర్యటించారు. హోమ్ క్వారంటైన్లలో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కుటుంబంలో ఎవరికైనా తమ ఆరోగ్యంపై అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే […]

Update: 2020-04-12 01:51 GMT

దిశ, నల్లగొండ:
కొవిడ్ – 19 వ్యాప్తిని అరికట్టేందుకు విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది కంటైన్‌మెంట్ ఏరియా పరిధిలో ఎప్పటికప్పుడు వివరాలు సేకరించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలోని కంటైన్‌మెంట్ ఏరియాలో ఆదివారం పర్యటించారు. హోమ్ క్వారంటైన్లలో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కుటుంబంలో ఎవరికైనా తమ ఆరోగ్యంపై అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు కచ్చితంగా వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రమణారెడ్డి, సీఐలు ప్రభాకర్ రెడ్డి, నిగిడాల సురేష్, ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు.

Tags: Nalgonda, coronavirus, Sp Ranganath, Covid-19, Containment area

Tags:    

Similar News