ఏం భయం లేదు.. ధైర్యంగా ఉండండి : ఎమ్మెల్యే లింగయ్య
దిశ, నార్కట్‌పల్లి: కరోనా బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని వెలిమినేడు, వెల్లంకి గ్రామాల్లోని కొవిడ్ ఐసోలేసన్ కేంద్రాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పట్ల అలసత్వం వహించొవద్దని ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బాధితులకు సూచించారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజల్లో ఉంటూ అవగాహన కల్పించాలని, అవసరమైన గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. […]
దిశ, నార్కట్‌పల్లి: కరోనా బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని వెలిమినేడు, వెల్లంకి గ్రామాల్లోని కొవిడ్ ఐసోలేసన్ కేంద్రాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి పట్ల అలసత్వం వహించొవద్దని ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని బాధితులకు సూచించారు. వైద్య సిబ్బంది నిత్యం ప్రజల్లో ఉంటూ అవగాహన కల్పించాలని, అవసరమైన గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేత
అనారోగ్యంతో మృతి చెందిన వెల్లంకి గ్రామానికి చెందిన చెన్నోజు మల్లేష్ చారి కుటుంబాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం పరామర్శించారు. అంతేగాకుండా.. పదివేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మల్లేష్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.