శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్‌ గేట్లు మూసివేత

దిశ, నాగార్జునసాగర్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నది శాంతించింది. దీంతో శ్రైశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద నీరు తగ్గింది. శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వద్ద జలకళ తగ్గుతోంది. నీటి ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద […]

Update: 2021-08-06 08:26 GMT

దిశ, నాగార్జునసాగర్‌ : ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నది శాంతించింది. దీంతో శ్రైశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులకు వరద నీరు తగ్గింది. శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లను మూసివేశారు. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల వద్ద జలకళ తగ్గుతోంది. నీటి ప్రవాహం తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. నాగార్జునసాగర్ గేట్లు మూతపడడంతో పర్యాటకులు నిరూత్సాహానికి గురవుతున్నారు.

Tags:    

Similar News