ముజఫర్‌నగర్‌లో సూపర్ కాప్ డాగ్‌కు విగ్రహం
దిశ, ఫీచర్స్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పోలీసులే కాదు ‘శునకాలు’ కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటాయి. ఈ క్రమంలోనే విశేష సేవలందించిన ముజఫర్ నగర్ పోలీస్ డాగ్ స్క్వాడ్ మెంబర్ ‘ఎఎస్‌పీ టింకీ’ గత నవంబర్‌లో మరణించింది. 49కి పైగా క్రిమినల్ కేసులను పరిష్కారంలో యూపీ పోలీసులకు సహాయం చేసిన ‘టింకీ’ గౌరవార్థం.. ముజఫర్ నగర్ పోలీస్ బృందం ఇటీవలే దాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ విగ్రహ చిత్రాలను ఐపీఎస్ అధికారి అభిషేక్ యాదవ్‌తో పాటు యుూపీ పోలీసులు […]
దిశ, ఫీచర్స్: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పోలీసులే కాదు ‘శునకాలు’ కూడా ప్రాణాలకు తెగించి పోరాడుతుంటాయి. ఈ క్రమంలోనే విశేష సేవలందించిన ముజఫర్ నగర్ పోలీస్ డాగ్ స్క్వాడ్ మెంబర్ ‘ఎఎస్‌పీ టింకీ’ గత నవంబర్‌లో మరణించింది. 49కి పైగా క్రిమినల్ కేసులను పరిష్కారంలో యూపీ పోలీసులకు సహాయం చేసిన ‘టింకీ’ గౌరవార్థం.. ముజఫర్ నగర్ పోలీస్ బృందం ఇటీవలే దాని విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఈ విగ్రహ చిత్రాలను ఐపీఎస్ అధికారి అభిషేక్ యాదవ్‌తో పాటు యుూపీ పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పంచుకోవడంతో నెటిజన్ల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఎనిమిదేళ్ల జర్మన్ షెషర్డ్ డాగ్ ‘టింకీ’.. ఆరేళ్లుగా పోలీస్ విభాగంలో ఎనలేని సేవలందిస్తూ, పలు అనారోగ్య కారణాల వల్ల ఇటీవలే మరణించింది. ఇక ‘టింకీ’కి రెండేళ్ల వయసున్నప్పుడు గ్వాలియర్‌లోని ‘బీఎస్ఎఫ్ అకాడమీ’కి చెందిన నేషనల్ డాగ్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ‘ముజఫర్ నగర్ డాగ్ స్వ్కాడ్ విభాగం’ రిక్రూట్ చేసుకుంది. స్నిఫర్ డాగ్‌గా ఎంపికై, ఆ తర్వాత తన పనితనంతో ఆరేళ్లలోనే ఆరు ప్రమోషన్లతో ఏఎస్‌పీ వరకు చేరడం ఓ రికార్డ్. దాని డ్యూటీలో భాగంగా, అనేక బ్లైండ్ కేసులను పరిష్కరించడంలో టింకీ పోలీసులకు సాయం చేసింది. సాధారణంగా శునకాలు క్రైమ్ జరిగిన 24 గంటల తర్వాత వాసన చూడలేవు, కానీ దీనికి మాత్రం ఆధారాలు పసిగట్టే సామర్థ్యం చాలా భిన్నంగా ఉంటుంది.
ఈ క్రమంలో10 రోజుల నుండి తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని కనుగొంది. 2018లో, బుధానాలో అక్రమ సంబంధాల కారణంగా ఒకరిని హత్య చేసి, మృతదేహాన్ని ఒక సంచిలో ప్యాక్ చేసి చెరువులో పడేశారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే టింకీ మృతదేహాన్ని కనుగొనగా, పోలీసులు దాన్ని వెలికి తీశారు. మరొక కేసులో భాగంగా, భోరకాలన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కపుర్‌గర్ గ్రామంలో.. ఓ మహిళను చంపిన తరువాత మృతదేహాన్ని గడ్డిలో దాచారు. ఆ మృతదేహాన్ని వెలికి తీయడంలో, నేరానికి పాల్పడిన అక్కను శిక్షించడంలో పోలీసులకు టింకీ సాయం చేసింది. రైల్వే ప్రాపర్టీ దొంగిలించిన రాబరీ గ్యాంగ్‌ను పట్టుకోవడానికి దాదాపు 10 కి.మీ వాసన చూస్తూ వెళ్లి దొంగలను పట్టించింది. ఇలా మొత్తంగా 49 కేసులను సాల్వ్ చేయడంతో టింకీ సేవలు ఎనలేనివని పోలీసులు తెలిపారు. ‘టింకీ శ్రమకు గుర్తింపుగా విగ్రహం కట్టించడం నిజంగా అభినందనీయం. ఇంతకుమించిన నివాళి మరొకటి ఉండదు. నా సహచరుడు అమరత్వం పొందాడు’ అని టింకీ హ్యాండ్లర్ మహేష్ కుమార్ అన్నాడు. అతడు త్వరలోనే అడిషనల్ ఎస్‌పీగా ప్రమోషన్ అందుకోబోతున్నాడు.