అయ్యప్ప స్వామికి ముస్లిం భక్తుడు.. స్వాముల కోసం ప్రత్యేకంగా..!
దిశ, బజార్ హత్నూర్ : మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు కులమతాల కోసం కొట్టుకుని చస్తుంటారు. రక్త పాతాలకు పాల్పడుతుంటారు. ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగి ఉంటారు. అయితే ప్రజలను కులమతాల పేరుతో విభజించి రాజకీయ పబ్బం గడుపుకునే పొలిటికల్ లీడర్స్ ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ఈ వైషమ్యాలు తొలగిపోవని కొందరు మేధావులు చెబుతున్నారు.అయితే, మనదేశంలో చాలా ఏండ్ల కిందట నుంచే హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఒకరి పండుగలకు ఒకరు […]
దిశ, బజార్ హత్నూర్ : మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నేటికీ కొందరు కులమతాల కోసం కొట్టుకుని చస్తుంటారు. రక్త పాతాలకు పాల్పడుతుంటారు. ఒకరంటే ఒకరికి ద్వేషం కలిగి ఉంటారు. అయితే ప్రజలను కులమతాల పేరుతో విభజించి రాజకీయ పబ్బం గడుపుకునే పొలిటికల్ లీడర్స్ ఉన్నన్ని రోజులు ఈ దేశంలో ఈ వైషమ్యాలు తొలగిపోవని కొందరు మేధావులు చెబుతున్నారు.అయితే, మనదేశంలో చాలా ఏండ్ల కిందట నుంచే హిందువులు, ముస్లిములు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు. ఒకరి పండుగలకు ఒకరు హాజరవడమే కాకుండా సంతోషంగా జరుపుకుంటుంటారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హత్నూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర మందిరంలో అయ్యప్ప స్వామి భక్తులకు ఇచ్చోడ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మౌలానా అనే ముస్లిం భక్తుడు మతాలకు అతీతంగా అన్నదాన కార్యక్రమం (భిక్ష) ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకుముందు కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. హిందూ ముస్లిం భాయి భాయి అనే పదానికి ప్రతీకగా ఈ యువకుడు నిలిచాడని గ్రామంలోని ప్రజలు చెప్పుకుంటున్నారు. కార్యక్రమంలో గురుస్వాములు పండరీ, బిట్లింగ్ లక్ష్మణ్, స్వాములు మురళి క్రిష్ణ, కిషన్, విజయ్ శేఖర్, రత్నాకర్, యాదవ్ గౌడ్, వెంకన్న, వినాయక్ పాల్గొన్నారు.