వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ.డేవిడ్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని

Update: 2024-12-28 10:43 GMT

దిశ, బెజ్జూర్ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ డేవిడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బెజ్జూర్ మండలం తాసీల్దార్ కార్యాలయం, సీఎస్సీ సెంటర్, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ డేవిడ్ పరిశీలించారు. తాసీల్దార్ కార్యాలయం, సీఎస్సీ సెంటర్ రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జేసీ డేవిడ్ మాట్లాడారు. ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జిల్లాలో 34 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు ఏ గ్రేడ్ వరి ధాన్యం రూ.2320 , బి గ్రేడ్ వరి ధాన్యం రూ. 2300 ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా వరి గాని కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు ప్రభుత్వం రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సిఎస్సి సెంటర్ ను పరిశీలించి, స్టాక్ వివరాలను ఫార్మసిస్టును అడిగి తెలుసుకున్నారు. మెడికల్ రికార్డులు సక్రమంగా సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. టీటీ ఇంజక్షన్లు, రేబిస్ టీకా నందులను పరిశీలించారు. ఆయన వెంట తాసీల్దార్ భూమేశ్వర్, ఏపీఎం మోహన్ లాల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, సిబ్బంది ఉన్నారు.


Similar News