రోడ్డుపైకి మురికి నీరు.. ఇబ్బంది పడుతున్న బాటసారులు..

గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్ష్యణ లోపంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది.

Update: 2024-12-28 07:51 GMT

దిశ, వేమనపల్లి : గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పర్యవేక్ష్యణ లోపంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇస్తున్న కోట్ల రూపాయల నిధులు అధికారుల పర్యవేక్షణ లోపంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు లేక అభివృద్ధి కుంటుపడుతోంది. ప్రధానంగా మండలంలోని వేమనపల్లి పంచాయతీ వేమనపల్లి గ్రామంలో ప్రధాన పాత బస్టాండ్ రోడ్డులో నెల రోజులుగా డ్రైనేజీ నీరు రోడ్డు పై చేరి కంపు కొడుతోంది.

రోడ్డు పై నుంచి డ్రైనేజీ నీరు వెళ్తుండడంతో రైతులు వెళ్లే ప్రజలు, ప్రయాణికులు, అధికారులు సైతం నీటి అడుగు భాగంలో ఏమి ఉంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. రోజుల తరబడి నీరు నిలిచి ఉండడంతో దోమలకు ఆవాసంగా మారుతోంది. దీంతో ఏం రోగాలు వస్తాయోనని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో ప్రధాన రోడ్డు పై నిలిచి ఉన్న మురుగు నీటిని తొలగించేలా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Similar News