తాగిన మత్తులో వ్యక్తి హల్‌చల్.. ఒకరి హత్య

దిశ, చేవెళ్ల: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మద్యం మత్తులో గొడవపడి ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన నక్క మహిపాల్ అదే గ్రామానికి చెందిన బేగరి రాజు (38) తమ్ముడైన నర్సింలు దగ్గర రూ.1800 అప్పుగా తీసుకున్నాడు. మంగళవారం నక్క మహిపాల్, బేగరి నర్సింలు […]

Update: 2021-06-16 08:55 GMT

దిశ, చేవెళ్ల: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు మద్యం మత్తులో గొడవపడి ఒక వ్యక్తిని హత్య చేసిన సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన నక్క మహిపాల్ అదే గ్రామానికి చెందిన బేగరి రాజు (38) తమ్ముడైన నర్సింలు దగ్గర రూ.1800 అప్పుగా తీసుకున్నాడు. మంగళవారం నక్క మహిపాల్, బేగరి నర్సింలు ఇద్దరూ డబ్బుల కోసం గొడవ పడగా.. గ్రామస్తులు వారిని సముదాయించారు. తిరిగి బుధవారం మహిపాల్ బేగరి రాజుతో కలిసి మద్యం సేవిస్తూ ఉండగా.. తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తావంటూ అడగడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది.

దీంతో కోపోద్రిక్తుడైన మహిపాల్ బేగరి రాజును కర్రలు,రాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. నిందితుడు మహిపాల్ పరారీలో ఉన్నాడని చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ తెలిపారు.

Tags:    

Similar News