పాస్ పుస్తకం కోసం హత్య

దిశ, ఏపీ బ్యూరో: డబ్బు బంధాలను, ప్రేమ ఆప్యాయతలను దూరం చేస్తోంది. రక్త సంబంధీకులను సైతం పరారీ వాళ్లను చేస్తోంది. ఆస్తుల ముందు అన్నాతమ్ముడు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా తెగ నరుక్కుంటున్నారు.ఆస్తి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న వివాదం ప్రాణాలు తీసే వరకు దారి తీసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు హతమయ్యారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేర్లపాడులో అన్నదమ్ముల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన […]

Update: 2020-06-30 08:55 GMT

దిశ, ఏపీ బ్యూరో: డబ్బు బంధాలను, ప్రేమ ఆప్యాయతలను దూరం చేస్తోంది. రక్త సంబంధీకులను సైతం పరారీ వాళ్లను చేస్తోంది. ఆస్తుల ముందు అన్నాతమ్ముడు, భార్యాభర్తలు అనే తేడా లేకుండా తెగ నరుక్కుంటున్నారు.ఆస్తి విషయంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న వివాదం ప్రాణాలు తీసే వరకు దారి తీసింది. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఒకరు హతమయ్యారు.

గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పేర్లపాడులో అన్నదమ్ముల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జులియన్ బాబు, అతడి అన్నకు వ్యవసాయ పొలానికి సంబంధించిన విషయంలో గొడవ జరిగింది. దీంతో కొపొద్రిక్తుడున అన్న కల్లు గీసే కొడవలితో తమ్ముడు బాబును నరికాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను వైద్యం కోసం బాపట్ల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పొలానికి సంబంధించిన పాసు పుస్తకాల విషయంలో గొడవ జరిగిందని మృతుడి భార్య మార్తమ్మ తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News