పాతకక్షలు.. మాటువేసి కత్తులు, గొడ్డళ్లతో దాడి

దిశ, డోర్నకల్: పాత కక్షల నేపథ్యంలో మాటువేసి కత్తులు, గొడ్డళ్లతో ఇద్దరిపై దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్లవుకల్లో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కేషబోయిన వెంకన్న, శ్రీనులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఇద్దరిపై అదే గ్రామానికి చెందిన బోయిని లింగన్న, బోయిని మల్లేశం, బోయిని […]

Update: 2021-08-19 10:41 GMT

దిశ, డోర్నకల్: పాత కక్షల నేపథ్యంలో మాటువేసి కత్తులు, గొడ్డళ్లతో ఇద్దరిపై దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తాళ్లవుకల్లో ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం తాళ్ల ఊకల్ గ్రామానికి చెందిన కేషబోయిన వెంకన్న, శ్రీనులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే బుధవారం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న ఇద్దరిపై అదే గ్రామానికి చెందిన బోయిని లింగన్న, బోయిని మల్లేశం, బోయిని వెంకన్న, కేషబోయిన గోపెయ్య, కిష్టయ్య మరో ముగ్గురూ దారికి అడ్డంగా ట్రాక్టర్ ఉంచి ఒక్కసారిగా ఇద్దరిపై మారణయుధాలతో దాడికి పాల్పడినట్లు బాధితుడు తెలిపాడు. ఈ దాడిలో వెంకన్న స్పృహ కోల్పయి పడిపోవడంతో చనిపోయాడనుకొని దుండగులు వెళ్లిపోయారు. కానీ వెంకన్న కుమారుడు తండ్రిని, శ్రీనుని డొంక మార్గం గుండా ఇంటికి తీసుకెళ్లి, అటునుంచి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భిక్షపతి తెలిపారు.

పాత గొడవలే దాడికి కారణం?

బాధితుడు వెంకన్న దాడికి పాల్పడిన లింగన్న పై కొన్నేళ్ల కింద ఓ అభియోగం పై ఫిర్యాదు చేశాడు. ఈ కేసే దాడికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తనపై కేసు పెట్టిన వెంకన్నపై పగ తీర్చుకోవాలి అనుకున్న బోయిని లింగన్న అతని సోదరుడు బాధితుడి పొలంలో గుండా ట్రాక్టర్ తీసుకెళ్లాడు. ఎందుకు నా పొలంలో ట్రాక్టర్ తెచ్చావంటూ వెంకన్న వారించాడు. అనంతరం సాయంత్రం ఇద్దరిపై దాడికి పాల్పడినట్లు బాధితుడి కుమారుడు తెలిపాడు.

Tags:    

Similar News