పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పై హత్యాయత్నం కేసు

దిశ, కరీంనగర్ : పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌తో పాటు ఆయన అనుచరుడు, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యం మరికొందరిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం హత్యాయత్నం కేసు నమోదైంది. 291,147,148,307,427 r/w 149 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 231/2020గా పోలీసులు తెలిపారు. వివరాల్లోకివెళితే.. సోమవారం గోదావరిఖనిలో హెచ్.ఎం.ఎస్.నాయకుడు అంబటి నరేశ్ యాదవ్ ఇంటిపై […]

Update: 2020-06-09 12:01 GMT

దిశ, కరీంనగర్ :
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌తో పాటు ఆయన అనుచరుడు, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యం మరికొందరిపై గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం హత్యాయత్నం కేసు నమోదైంది. 291,147,148,307,427 r/w 149 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 231/2020గా పోలీసులు తెలిపారు. వివరాల్లోకివెళితే.. సోమవారం గోదావరిఖనిలో హెచ్.ఎం.ఎస్.నాయకుడు అంబటి నరేశ్ యాదవ్ ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని, నరేష్ యాదవ్ ఇంటికి వెల్లిన వారిలో తన అనుచరులు ఉన్నప్పటికీ తాను వ్యక్తిగతంగా హాజరు కాలేదన్న విషయాన్ని పుట్ట మధు చెబుతున్నట్టు సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి, అసలు నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారపార్టికి చెందిన జెడ్పీ ఛైర్మన్‌ పై హత్యాయత్నం కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News