విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై మంత్రి బొత్స క్లారిటీ..
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఏపీలో ప్రతిపక్ష, విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతుండటంతో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం స్పందించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.అంతేకాకుండా, కేంద్రం తీసుకున్ని నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారని చెప్పారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా […]
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని ప్రకటన వెలువడిన నాటి నుంచి ఏపీలో ప్రతిపక్ష, విపక్షాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కూడా వెల్లువెత్తుతుండటంతో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం స్పందించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.అంతేకాకుండా, కేంద్రం తీసుకున్ని నిర్ణయానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడుతామని స్పష్టంచేశారు.
పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మద్దతుదారులు సత్తా చాటారని చెప్పారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని చెప్పడానికి ఈ ఫలితాలే నిదర్శమని చెప్పుకొచ్చారు.చంద్రబాబులా తాము అంకెలగారడీ చేయడం లేదని విమర్శించారు.ఇప్పటికిప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెట్టినా ఎదుర్కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు.