అత్యుత్సాహం.. కడీలు ఎత్తుకెళ్లిన మున్సిపల్ కమిషనర్

దిశ, పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 20 లో గల మూడు గుంటల భూమిలోని కడీలను విరగ్గొట్టి, ఫెన్సింగ్‌ను ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. కనీసం భూ యజమానులకు సమాచారం ఇవ్వకుండా ఎత్తుకెళ్లడంతో కమిషనర్ చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. మున్సిపల్ కమిషనర్‌ చర్యలపై స్పందించిన భూమి యజమానులు.. తమ భూములపై మున్సిపల్ కమిషనర్ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని తప్పుబట్టారు. మున్సిపల్ […]

Update: 2021-06-29 08:35 GMT

దిశ, పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 20 లో గల మూడు గుంటల భూమిలోని కడీలను విరగ్గొట్టి, ఫెన్సింగ్‌ను ట్రాక్టర్‌లో తీసుకెళ్లారు. కనీసం భూ యజమానులకు సమాచారం ఇవ్వకుండా ఎత్తుకెళ్లడంతో కమిషనర్ చర్యను స్థానికులు తప్పుబడుతున్నారు. మున్సిపల్ కమిషనర్‌ చర్యలపై స్పందించిన భూమి యజమానులు.. తమ భూములపై మున్సిపల్ కమిషనర్ ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదని తప్పుబట్టారు.

మున్సిపల్ పరిధిలోని అనేక అక్రమ నిర్మాణాలపై నోరుమెదపని ఆయన, తమ భూమిలో కడ్డీలను విరగ్గొట్టి, ఫెన్సింగ్ తీసుకెళ్లడం ఏంటని మండిపడ్డారు. విరగ్గొట్టిన కడీల పక్కనే 20 ఫీట్ల రోడ్డులో అడ్డంగా పెరిగిన చెట్లు తొలగించాలన్న జ్ఞానం లేని కమిషనర్ తమ భూమిలో కడీలు తొలగించడంపై ఎందుకు ఆసక్తి చూపించారని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడీలు విడగొట్టిన కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News