కేసీఆర్ అందుకే బతుకమ్మ చీరలను ఇస్తున్నారు..

దిశ, గండిపేట్: మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని నార్సింగి మున్సిపల్ చైర్‌పర్సన్ రేఖా యాదగిరి, కౌన్సిలర్ అన్నారు. శనివారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులో కౌన్సిలర్ యాదమ్మ కిషోర్ యాదవ్‌తో కలిసి చైర్మన్ రేఖా యాదగిరి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతియేటా ఆడబిడ్డలు కొత్త చీరలను కట్టుకొని ఆనందకర వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ […]

Update: 2021-10-02 09:04 GMT

దిశ, గండిపేట్: మహిళల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని నార్సింగి మున్సిపల్ చైర్‌పర్సన్ రేఖా యాదగిరి, కౌన్సిలర్ అన్నారు. శనివారం నార్సింగి మున్సిపల్ పరిధిలోని మొదటి వార్డులో కౌన్సిలర్ యాదమ్మ కిషోర్ యాదవ్‌తో కలిసి చైర్మన్ రేఖా యాదగిరి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతియేటా ఆడబిడ్డలు కొత్త చీరలను కట్టుకొని ఆనందకర వాతావరణంలో బతుకమ్మ పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో నాయకులు యాదగిరి, మాజీ యూత్ అధ్యక్షుడు మర్రి వేణుగోపాల్ రెడ్డి, దార మహేందర్, టీఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు బి.సాయి, పర్వేద రాజు పాల్గొన్నారు.

Tags:    

Similar News