రస్సెల్ సూపర్ బౌలింగ్.. ముంబై స్కోర్ 152/ ఆలౌట్

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ బెంబేలెత్తించారు. పదునైన బంతులు వేస్తూ తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఆది నుంచే బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి తీసుకొస్తూ.. కీలక సమయంలో వికెట్లు తీసుకున్నారు. దీనికి తోడు డాట్ బంతులు ముంబై స్కోరు బోర్డుకు ఆటంకం కలిగించాయి. ఎంఏ చిదంబరం వేదికగా జరిగిన KKR vs MI మ్యాచ్‌లో.. రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే […]

Update: 2021-04-13 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్ ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టును కోల్‌కతా నైట్ రైడర్స్ బెంబేలెత్తించారు. పదునైన బంతులు వేస్తూ తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ఆది నుంచే బ్యాట్స్‌మెన్లపై ఒత్తిడి తీసుకొస్తూ.. కీలక సమయంలో వికెట్లు తీసుకున్నారు. దీనికి తోడు డాట్ బంతులు ముంబై స్కోరు బోర్డుకు ఆటంకం కలిగించాయి. ఎంఏ చిదంబరం వేదికగా జరిగిన KKR vs MI మ్యాచ్‌లో.. రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 152 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.

ఇన్నింగ్స్ సాగిందిలా..

ఓపెనర్ రోహిత్ శర్మ (43), సూర్యకుమార్ యాదవ్ (56) రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలమయ్యారు. రోహిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టగా.. సూర్య కుమార్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, కీలక బ్యాట్స్‌మెన్లు అయిన డీకాక్(2), ఇషాన్ కిషన్(1), హార్దిక్ పాండ్యా(15) పొలార్డ్ (5), పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. ఇక లోయర్ ఆర్డర్‌లో వచ్చిన మార్కో జాన్సెస్ డకౌట్ కావడంతో.. 126 పరుగుల వద్ద ముంబై 7 వికెట్లను నష్టపోయింది. ఆ తర్వాత డెత్ ఓవర్లలో కృనాల్ పాండ్యా (15), రాహుల్ చాహర్ (6), బుమ్రా (0) డకౌట్ కావడంతో ముంబై ఇండియన్ 20 ఓవర్ చివరి బంతికి ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ కేవలం 152 పరుగులు మాత్రమే చేయగలిగింది.

రస్సెల్ సూపర్ బౌలింగ్

కేకేఆర్‌లో ప్రతీ ఏడాది బ్యాట్‌తో చెలరేగే ఆండ్రూ రస్సెల్ ఈ రోజు మాత్రం బంతితో రాణించాడు. MI జట్టులో 5 వికెట్లు తీసుకొని స్కోరు బోర్డును కట్టడి చేశాడు. 2 ఓవర్లు మాత్రమే వేసిన రస్సెల్ 15 పరుగులు ఇచ్చి.. చివరి ఓవర్‌లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ 2, వరుణ్ చక్రవర్తి, షకిబుల్ హాసన్, ప్రసీద్ కృష్ణ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

Tags:    

Similar News