బొగత అందాలు.. చూడడానికి సరిపోవు రెండు కళ్లు
దిశ, వాజేడు: తెలంగాణ నయాగరా జలపాతంగా పిలవబడే ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం జలకళ సంతరించుకున్నది. గురువారం కురిసిన వర్షాలకు ఛత్తీస్‌ఘఢ్ అటవీ ప్రాంతం నుండి భారీగా నీరు చేరడంతో వేసవికాలంలో నీరులేక ఇన్నాళ్లు బోసిపోయిన బొగత జలపాతంలలో జలకళ ఉట్టి పడుతోంది. జలధారలు సుమారు యాభై అడుగుల ఎత్తునుండి లోయలోకి జాలువారుతూ.. తుంపర్లు ఎగిసిపడుతూ.. అందాలను వెదజల్లుతోంది. ఓ వైపు జలధార శబ్ధం. జలపాతం ఇరువైపుల పచ్చదనంతో నిండిన అడవి, అడవిలో […]
దిశ, వాజేడు: తెలంగాణ నయాగరా జలపాతంగా పిలవబడే ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి బొగత జలపాతం జలకళ సంతరించుకున్నది. గురువారం కురిసిన వర్షాలకు ఛత్తీస్‌ఘఢ్ అటవీ ప్రాంతం నుండి భారీగా నీరు చేరడంతో వేసవికాలంలో నీరులేక ఇన్నాళ్లు బోసిపోయిన బొగత జలపాతంలలో జలకళ ఉట్టి పడుతోంది. జలధారలు సుమారు యాభై అడుగుల ఎత్తునుండి లోయలోకి జాలువారుతూ.. తుంపర్లు ఎగిసిపడుతూ.. అందాలను వెదజల్లుతోంది. ఓ వైపు జలధార శబ్ధం. జలపాతం ఇరువైపుల పచ్చదనంతో నిండిన అడవి, అడవిలో పక్షుల కేరింతల నడుమ బొగత జలపాతం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్ నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు మూసి వేయడంతో బొగత జలపాతం అందాలు చూసేందుకు యాత్రికులు సాహసించడం లేదు. దీంతో పర్యాటకులు లేక బొగత జలపాత ప్రాంగణం బోసిపోయి కనబడుతుంది.