కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జిగా ముకుల్
న్యూఢిల్లీ: ఏఐసీసీ(ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జిగా పని చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన నాయకులు దీపక్ బబారియ ఆ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. ఆయన స్థానంలో ముకుల్ వస్నిక్‌ను నియమిస్తున్నట్టు ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ తెలిపారు. దీపక్ రాజీనామాను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన నాయకులు జ్యోతిరాదిత్యా సింధియా ఇటీవల బీజేపీలో చేరడంతో అక్కడ ప్రభుత్వం […]
న్యూఢిల్లీ: ఏఐసీసీ(ఆలిండియా కాంగ్రెస్ కమిటీ) జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ఇన్‌చార్జిగా పని చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన నాయకులు దీపక్ బబారియ ఆ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా తప్పుకున్నట్టు ఆయన తెలిపారు. ఆయన స్థానంలో ముకుల్ వస్నిక్‌ను నియమిస్తున్నట్టు ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ తెలిపారు. దీపక్ రాజీనామాను అంగీకరిస్తున్నట్టు చెప్పారు. కాగా, కాంగ్రెస్ నుంచి మధ్యప్రదేశ్‌కు చెందిన నాయకులు జ్యోతిరాదిత్యా సింధియా ఇటీవల బీజేపీలో చేరడంతో అక్కడ ప్రభుత్వం పడిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
Tags: congress madhya pradesh in charge, deepak babaria, resignation, mukul, appointment