అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు
దిశ,వెబ్ డెస్క్ : అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని మన్ సుఖ్ హిరేన్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరెన్ మృతి వెనుక సచిన్ వాజే హస్తముందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్దవ్ ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. అయితే ఈ నేపథ్యంలో […]
దిశ,వెబ్ డెస్క్ : అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. రిలియన్స్ ఇండస్ట్రీ అధినేత ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు ఉంచిన వాహనం యజమాని మన్ సుఖ్ హిరేన్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో ఈ కేసు తీవ్రత పెరిగింది. దీంతో ఉద్దవ్ ప్రభుత్వం కేసును ఎన్ఐఏకు అప్పగించింది. హిరెన్ మృతి వెనుక సచిన్ వాజే హస్తముందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఉద్దవ్ ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో ముంబై అసిస్టెంట్ పోలీసు ఇన్ స్ట్పెక్టర్ సచిన్ వాజే ప్రమేయం ఉన్నట్టు ఎన్ఐఎ గుర్తించింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని 12 గంటలపాటు విచారించింది.అనంతరం అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.