వీడ్కోలు పలికినా తగ్గని ధోనీ బ్రాండ్ వాల్యూ

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్వాతంత్ర దినోత్సవం రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, అంతర్జాతీయ మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అతని బ్రాండ్ విలువలో ఎలాంటి మార్పు ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటకు ముందు అతను ఒక రోజు షూటింగ్‌కు రూ. 1.5 కోట్లు చార్జ్ చేసేవాడు. కొహ్లీ తీసుకునే ఫీజులో ఇది సగమే. అయినా చాలా కంపెనీలు మహీని గతంలో ధరకే ఎండార్స్ చేయించడానికి […]

Update: 2020-08-20 10:13 GMT

దిశ, స్పోర్ట్స్: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్వాతంత్ర దినోత్సవం రోజు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. కాగా, అంతర్జాతీయ మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా అతని బ్రాండ్ విలువలో ఎలాంటి మార్పు ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటకు ముందు అతను ఒక రోజు షూటింగ్‌కు రూ. 1.5 కోట్లు చార్జ్ చేసేవాడు. కొహ్లీ తీసుకునే ఫీజులో ఇది సగమే. అయినా చాలా కంపెనీలు మహీని గతంలో ధరకే ఎండార్స్ చేయించడానికి సుముఖంగా ఉన్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ధోనీ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ పోకర్ స్టార్స్, కార్స్ 24, ఇండియన్ టెర్రైన్, రెడ్ బస్, పనేరాయ్, ఆశోక్ లేలాండ్, కోకాకోలా వారి పవర్ డే, స్నికర్స్, డ్రీమ్ ఎలెవెన్, గల్ఫ్ ఆయిల్, ఇండిగో పెయింట్స్, సుమధురా గ్రూప్‌లకు ప్రచార కర్తగా ఉన్నాడు. అంతే కాకుండా ఫ్లిప్‌కార్ట్, అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ క్రికెట్ నుంచి నిష్క్రమించినా అతడిని తమ భాగస్వామిగానే కొనసాగించడానికి ఆయ సంస్థలు సుముఖత చూపుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌కు గుడ్ చెప్పిన అనంతరం ధోనీ బ్రాండ్ వాల్యూ చాలా తగ్గింది. అప్పటి నుంచి అది నిలకడగానే కొనసాగుతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.

Tags:    

Similar News