ధోనీ రనౌట్.. ఒక ఉద్వేగభరిత క్షణం
దిశ, స్పోర్ట్స్: సరిగ్గా ఏడాది క్రితం (2019, జూలై 10) న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గుప్తిల్ వేసిన డైరెక్ట్ త్రోకి ధోనీ రనౌట్‌గా పెవీలియన్ చేరాడు. ఆనాడు మహీ అవుటైన తర్వాత భారత క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెడతామని ఆశగా ఉన్న అభిమానులకు ధోనీ రనౌట్ ఒక షాక్. అయితే, ఆనాడు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఔటైన ధోనీ ఈనాటి వరకు బ్యాట్ పట్టి మ్యాచ్ ఆడటం అభిమానులు […]
దిశ, స్పోర్ట్స్: సరిగ్గా ఏడాది క్రితం (2019, జూలై 10) న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గుప్తిల్ వేసిన డైరెక్ట్ త్రోకి ధోనీ రనౌట్‌గా పెవీలియన్ చేరాడు. ఆనాడు మహీ అవుటైన తర్వాత భారత క్రికెట్ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు మ్యాచ్ గెలిచి ఫైనల్స్‌లో అడుగుపెడతామని ఆశగా ఉన్న అభిమానులకు ధోనీ రనౌట్ ఒక షాక్. అయితే, ఆనాడు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఔటైన ధోనీ ఈనాటి వరకు బ్యాట్ పట్టి మ్యాచ్ ఆడటం అభిమానులు చూడకపోవడం మరో బాధకరమైన విషయం. 2019 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టే ఫేవరెట్. గ్రూప్ దశలో కేవలం ఒకే ఓటమితో అగ్రస్థానంలో ఉంది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న కివీస్‌తో సెమీస్‌లో తలపడింది. షెడ్యూల్ ప్రకారం జూలై 9న మ్యాచ్ ప్రారంభమైంది. కానీ, న్యూజిలాండ్ స్కోర్ 211/5 వద్ద ఉన్నప్పుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మిగిలిన మ్యాచ్ జూలై 10న కొనసాగించారు. రెండో రోజు మ్యాచ్ కొనసాగించిన కివీస్ జట్టు 8 వికెట్లు నష్టపోయి 239 పరుగులు చేసింది. అయితే, భారత ఇన్నింగ్ ప్రారంభించిన వెంటనే వికెట్లు టపటపా పడిపోయాయి. చూస్తుండగానే టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఈ క్లిష్ట స్థితిలో క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ(50), రవీంద్ర జడేజా(77) ఆచితూచి ఆడుతూ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భారత విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో భారీ షాట్ ఆడబోయిన జడేజా విలియమ్సన్ చేతికి చిక్కాడు. అయినా ధోనీ ఉన్నాడనే భరోసా ఉండగా ఆ వెంటనే గప్తిల్ విసిరిన సూపర్ త్రోకు రనౌటయ్యాడు. దీంతో కోట్ల మంది భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. మైదానమంతా మూగబోయింది. చివరికి భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ బాధను ఈనాటికీ భారత క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేదు.