Fitness : పవర్ లిఫ్టింగ్‌తో మోస్ట్ బెనిఫిట్స్.. సెలబ్రిటీలు ఫాలో అయ్యేది అందుకేనా?

Fitness : పవర్ లిఫ్టింగ్‌తో మోస్ట్ బెనిఫిట్స్.. సెలబ్రిటీలు ఫాలో అయ్యేది అందుకేనా?

Update: 2024-11-16 07:36 GMT

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే రెగ్యులర్‌గా వ్యాయామాలు చేయడం మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఇందులోనూ హెచ్ ఐఐటీ, కార్డియో, పవర్ లిఫ్టింగ్ వంటి పలు రకాలు ఉంటాయి. కాగా ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న ఎక్సర్ సైజ్‌లలో పవర్ లిఫ్టింగ్ ఒకటి. ఇది మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. ఇంకా ఏయే బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

ఫిజికల్ బెనిఫిట్స్

పవర్ లిఫ్టింగ్ నిజానికి ఒక అద్భుతమైన శారీరక వ్యాయామం. దీనివల్ల బాడీలో స్ట్రెంత్, అలాగే మజిల్స్ పెరుగుతాయి. ఇందులో భాగంగా ఉండే స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ వంటివి రెగ్యులర్‌గా చేసేవారికి మిగతా వారితో పోలిస్తే ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా మారుతాయి. బోన్ డెన్సిటీ పెరుగుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గుతుంది.

మానసిక ఆరోగ్య ప్రయోజనాలు

పవర్ లిఫ్టింగ్ వ్యాయామం మెంటల్ హెల్త్ పరంగానూ అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా చేసేవారిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీస్, డిప్రెషన్ వంటి సమస్యలు దూరం అవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో చేసే వర్క్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టగలుగుతారు. తద్వారా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పవర్ లిఫ్టింగ్ కారణంగా శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది.

గుండె ఆరోగ్యానికీ మంచిదే..

షుగర్ పేషెంట్లు కూడా పవర్ లిఫ్టింగ్ వ్యాయామం చేయవచ్చు. దీనివల్ల రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయి. కాకపోతే ఈ సందర్భంగా గాయాలు తగలకుండా జాగ్రత్త పడాలంటున్నారు నిపుణులు. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను బర్న్ చేయడంలో కూడా పవర్ లిఫ్టింగ్ సహాయపడుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అయితే దీనిని ప్రారంభించే ముందు మీ శరీర తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నవారు కోచ్ లేదా ట్రైనర్ సలహాల తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News