ఎంఆర్ కాలేజీ ప్రైవేటీకరణ సరికాదు

దిశ, వెబ్‎డెస్క్: మాన్సాన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కాలేజీ) ప్రైవేటీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా ఆనంద గజపతి రాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతి రాజు స్పందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు. కొందరు వ్యక్తులు తన తాత, తండ్రి పేరు ప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఊర్మిళ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలేజీని ప్రైవేటీకరించాలని పూనుకోవడం బాధాకరమని.. ఇక్కడ […]

Update: 2020-10-06 10:39 GMT

దిశ, వెబ్‎డెస్క్: మాన్సాన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని విజయనగరం మహారాజా కళాశాల (ఎంఆర్ కాలేజీ) ప్రైవేటీకరణ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా ఆనంద గజపతి రాజు మరో కుమార్తె ఊర్మిళ గజపతి రాజు స్పందించారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం తగదని అన్నారు.

కొందరు వ్యక్తులు తన తాత, తండ్రి పేరు ప్రతిష్ఠలు చెడగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఊర్మిళ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కాలేజీని ప్రైవేటీకరించాలని పూనుకోవడం బాధాకరమని.. ఇక్కడ చదువుకున్న వారు దేశవిదేశాల్లో మెరుగైన స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ కళాశాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామంటే తాము అంగీకరించబోమని ఊర్మిళ స్పష్టం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ అంశంపై మాట్లాడేందుకు ఏడాది కాలంగా సీఎం జగన్ అపాయింట్‎మెంట్ ప్రయత్నిస్తున్నా దొరకడం లేదని ఊర్మిళ గజపతిరాజు విచారం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News