రాముడి విగ్రహం ధ్వంసం వెనుక చంద్రబాబు పాత్ర..
దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైసీపీ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు.విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని,దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి […]
దిశ, విశాఖపట్నం : విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం ఆలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని వైసీపీ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు.విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థంలోని రాముని విగ్రహం ధ్వంసం వెనుక కుట్ర దాగి ఉందని,దీనిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఖచ్చితంగా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ప్రజల దృష్టి మరల్చేందుకే టీడీపీ నాయకులు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. అర్ధరాత్రి ఆలయంలో ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఎట్టకేలకు ఆయా విగ్రహం శిరస్సు భాగాన్ని ఆలయంలోని రామకొలనులో గుర్తించారు. మరో వైపు చినజీయర్ స్వామి ఆశ్రమం ప్రతినిథులతో శిరస్సు పునఃప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ ఘటనపై ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ నేపథ్యంలో దుండగుల దాడి కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.