చంద్రబాబుపై విజయసాయి హాట్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలుచేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని, వైసీపీ ఎంపీలమైన మేము పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ […]

Update: 2020-12-07 20:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్దఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వ్యవసాయ చట్టాలు మూడింటిని రద్దు చేయాలని కోరుతూ రైతులు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పలు పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.

ఈ నేపథ్యంలోనే ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ‘వ్యవసాయ బిల్లులపై మారు మాట్లాడకుండా మద్దతిచ్చాడు బాబు. స్వామినాథన్ కమిటీ రిపోర్టు అమలుచేయాలని, కనీస మద్దతు ధర ఉండాల్సిందేనని, వైసీపీ ఎంపీలమైన మేము పార్లమెంట్‌లో గట్టిగా మాట్లాడాం. మూడు వ్యవసాయ బిల్లులపై ఒక్క సవరణను అయినా సూచించావా బాబూ..? చంద్రబాబుకు రైతులకన్నా హెరిటేజ్ ప్రయోజనాలే ఎక్కువైపోయాయి’. అంటూ సైటైర్లు వేశారు.కాగా, రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విషయంలో టీడీపీ పార్టీ తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది.

Tags:    

Similar News