లుక్‌ఔట్ నోటీసులపై టీఎస్ హైకోర్టుకు ఎంపీ సుజనా..
దిశ, వెబ్‌డెస్క్ : తనకు లుక్‌నోట్ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ సుజనా చౌదరీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ప్రస్తుతం ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన సుజనా చౌదరీని ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోటీసులు జారీ అయినందున దేశం విడిచి వెళ్లరాదని విచారణ అధికారులు ఎంపీకి స్పష్టంచేశారు. దీనిపై ఎంపీ సుజనా స్పందిస్తూ.. […]
దిశ, వెబ్‌డెస్క్ : తనకు లుక్‌నోట్ నోటీసులు జారీ చేయడంపై ఎంపీ సుజనా చౌదరీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ప్రస్తుతం ఆయనపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన సుజనా చౌదరీని ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నోటీసులు జారీ అయినందున దేశం విడిచి వెళ్లరాదని విచారణ అధికారులు ఎంపీకి స్పష్టంచేశారు. దీనిపై ఎంపీ సుజనా స్పందిస్తూ.. తానేమీ దేశం విడిచి పారిపోవడం లేదని, అన్యాయంగా తనను అడ్డుకున్నారంటూ అధికారులపై సీరియస్ అయ్యారు. అందులో భాగంగానే రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.