మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలే: రేవంత్ రెడ్డి

దిశ, అచ్చంపేట: మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే అగ్రి చట్టాలకు వంత పాడుతున్నారని విమర్శించారు. సంపాదన కోసం రైతు వ్యవసాయం చేయడని, ఆకలి తీర్చడం కోసమే చేస్తాడని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రైతు భరోసా యాత్రను ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ చేయడం […]

Update: 2021-02-07 09:34 GMT

దిశ, అచ్చంపేట: మోడీ, కేసీఆర్ ఇద్దరు దొంగలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అందుకే అగ్రి చట్టాలకు వంత పాడుతున్నారని విమర్శించారు. సంపాదన కోసం రైతు వ్యవసాయం చేయడని, ఆకలి తీర్చడం కోసమే చేస్తాడని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజీవ్ రైతు భరోసా యాత్రను ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రైతులకు రుణ మాఫీ చేయడం చేత కాలేదు కానీ, 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ వ్యక్తులకు కట్ట బెట్టారని పేర్కొన్నారు. రైతులను విదేశీ కంపెనీలకు కేంద్రం అమ్ముతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి వస్తున్నారని ఆరోపించారు.

రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోతే ఈ ముఖ్యమంత్రి అవసరమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. 1250 మంది ఆత్మబలిదానంతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం ఆస్తులను సమకూర్చుకుందని విమర్శించారు. ఆనాడు ఇందిరాగాంధీ అన్నివర్గాల ప్రజలకు కనీసం మూడెకరాల భూమి ఉండాలనే ఆలోచనతో ప్రత్యేకంగా సీలింగ్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందన్నారు. గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించాలని, ధర నిర్ణయించే శక్తి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News