మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణంరాజు
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌పై బయట ఉన్నారని…బయట ఉంటే సాక్షులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. జగన్‌పై నమోదైన 11 చార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ రెండు […]
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ బెయిల్‌పై బయట ఉన్నారని…బయట ఉంటే సాక్షులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో ఆరోపించారు. జగన్‌పై నమోదైన 11 చార్జిషీట్లపై సమగ్రంగా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ రెండు మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం వైఎస్ జగన్, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిల బెయిల్‌ను రద్దు చేయాలంటూ గతంలో ఎంపీ రఘురామ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లను సీబీఐ కోర్టు కొట్టేసింది. అయినప్పటికీ రఘురామకృష్ణంరాజు మళ్లీ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది.