సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ ఐదో లేఖ

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. వృద్ధాప్య పింఛన్లు, సీపీఎస్ రద్దు విధానం, పెళ్లి కానుక, షాదీముబారక్, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ల పై వరుసగా నాలుగు లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని […]

Update: 2021-06-14 02:49 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరో లేఖ రాశారు. వృద్ధాప్య పింఛన్లు, సీపీఎస్ రద్దు విధానం, పెళ్లి కానుక, షాదీముబారక్, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ల పై వరుసగా నాలుగు లేఖలు రాసిన ఆయన.. తాజాగా మరో లేఖ రాశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 1,100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారని ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆ హామీ నెరవేర్చకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పుకొచ్చారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇవ్వాలని లేఖలో ఎంపీ రఘురామ డిమాండ్ చేశారు. ఐదు రోజులుగా సీఎం జగన్‌కి లేఖలు రాస్తున్నారు ఎంపీ రఘురామ. అయితే ఆయన లేఖలపై వైసీపీ నేతలు మాత్రం స్పందించకపోవడం విశేషం.

Tags:    

Similar News