సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ ఝలక్

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోషాక్ ఇచ్చారు. ఇప్పటికే జగన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన తాజాగా జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ మైనింగ్‌లీజ్‌లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించినట్లు గుర్తు చేశారు. సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి […]

Update: 2021-06-22 10:46 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోషాక్ ఇచ్చారు. ఇప్పటికే జగన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన తాజాగా జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌ లీజు పొడిగింపుని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేశారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీ మైనింగ్‌లీజ్‌లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించినట్లు గుర్తు చేశారు.

సీబీఐ కేసును ప్రస్తావించకుండా హైకోర్టులో లీజ్ పొడిగింపునకు అనుమతి పొందారని ఆరోపించారు. కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేస్తే లీజు ఎలా పొడిగిస్తారని ప్రశ్నించారు. జగన్‌కు చెందిన కంపెనీ కావడంతోనే అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపించారు. పిటిషన్‌లో సరస్వతి కంపెనీ, పరిశ్రమలశాఖ, మైనింగ్ శాఖ, ఏపీ పొల్యూషన్ బోర్డులను ప్రతివాదులుగా రఘురామ కృష్ణంరాజు చేర్చారు.

Tags:    

Similar News