ఏపీ ప్రభుత్వంపై మోడీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వ్యవహార శైలి, ఆస్తుల తనఖాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. జగన్ సర్కార్ అర్హతకు మించి అప్పులు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఒకవైపు తనఖా పెట్టి.. మరోవైపు ఏపీఎస్‌డీసీకి బదిలీ చేసి మరీ రుణాలు సేకరిస్తోందని లేఖలో ఆరోపించారు. ఏపీఎస్‌డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్లు రుణాలు సేకరించిందన్నారు. ఉచిత పథకాలకు మరో రూ.3 […]
దిశ, ఏపీ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం వ్యవహార శైలి, ఆస్తుల తనఖాపై తీవ్ర ఆరోపణలు చేస్తూ లేఖ రాశారు. జగన్ సర్కార్ అర్హతకు మించి అప్పులు చేస్తోందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఒకవైపు తనఖా పెట్టి.. మరోవైపు ఏపీఎస్‌డీసీకి బదిలీ చేసి మరీ రుణాలు సేకరిస్తోందని లేఖలో ఆరోపించారు. ఏపీఎస్‌డీసీ ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి పదివేల కోట్లు రుణాలు సేకరించిందన్నారు. ఉచిత పథకాలకు మరో రూ.3 వేల కోట్ల రుణం తెచ్చేందుకు బ్యాంకులను సంప్రదిస్తోందని లేఖలో స్పష్టం చేశారు.
విశాఖలోని భూములను దుబాయ్‌కి చెందిన లులు సంస్థకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని మించి రాష్ట్రప్రభుత్వం అప్పులు చేసిందని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని దృష్టి సారించాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు.