రైల్వే జీఎంతో ఎంపీ నామా భేటీ.. పెండింగ్ ప్రాజెక్టులపై కీలక చర్చ
దిశ ప్రతినిధి, ఖమ్మం : పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. హైదరాబాద్ రైల్ నిలయంలో మంగళవారం రైల్వే జీఎం గజానన్ మాల్యా అధ్యక్షతన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కాన్ఫరెన్స్ హాలులో నామా రైల్వే సమస్యలను ప్రస్తావించారు. విభజన […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లను వెంటనే పూర్తి చేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు రైల్వే ఉన్నతాధికారులను కోరారు. హైదరాబాద్ రైల్ నిలయంలో మంగళవారం రైల్వే జీఎం గజానన్ మాల్యా అధ్యక్షతన దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ కాన్ఫరెన్స్ హాలులో నామా రైల్వే సమస్యలను ప్రస్తావించారు.
విభజన చట్టంలోని హామీ అయిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు భద్రాచలం- కొవ్వూరు రైల్వేలైన్ పురోగతిపై కూడా వివరాలు కోరారు. పలు స్టేషన్లలో ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల హాల్టింగ్స్‌పై రైల్వే జీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రెండు ఎస్కలేటర్లు, 50 అదనపు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా నామా కోరారు. అంతేకాకుండా ఆటో స్టాండ్‌కు షెడ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విన్నవించారు.
వీటితో పాటు పలు రకాల సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నామా గజానన్ మాల్యాకు మొక్క బహూకరించగా.. గజానన్ మాల్యా ఎంపీని శాలువాతో సత్కరించారు.