కరెంట్ బిల్లు ఎగవేత.. ఆ మంత్రిదే టాప్ ప్లేస్.. నెటిజన్లు ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ‘యథా రాజా తథా ప్రజా’ అన్న నానుడిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్షర సత్యంగా మారుస్తుంది. తాజాగా దీనికి మధ్యప్రదేశ్ మంత్రి నిర్వచనంలా మారారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లు ఎగవేత దారులు రోజురోజుకు పెరిగిపోతున్నారని, కొందరు మొండి బాకీల్లా మారారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ విద్యుత్ అధికారులు బిల్లు ఎగవేతదారుల జాబితాను బహిర్గతం చేశారు. అందులో మధ్యప్రదేశ్ రెవెన్యూ, రావాణా శాఖ మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ అగ్రగామిగా నిలిచారు. విద్యుత్ […]
దిశ, వెబ్‌డెస్క్: ‘యథా రాజా తథా ప్రజా’ అన్న నానుడిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్షర సత్యంగా మారుస్తుంది. తాజాగా దీనికి మధ్యప్రదేశ్ మంత్రి నిర్వచనంలా మారారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ బిల్లు ఎగవేత దారులు రోజురోజుకు పెరిగిపోతున్నారని, కొందరు మొండి బాకీల్లా మారారని అధికారులు తెలిపారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ విద్యుత్ అధికారులు బిల్లు ఎగవేతదారుల జాబితాను బహిర్గతం చేశారు. అందులో మధ్యప్రదేశ్ రెవెన్యూ, రావాణా శాఖ మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ అగ్రగామిగా నిలిచారు.
విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం దాదాపు రూ.84,388 బిల్లును ఎగొట్టి అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు గోవింద్ సోదరుడు గులాబ్ సింగ్ రాజ్‌పుత్ రూ.34,667తో ఐదో స్థానంలో ఉన్నారు. కూడా ఈ జాబితాలో ఉంది. వీరితో పాటుగా కలెక్టర్ కార్యాలయం రూ.11,445, ఎస్‌పీ కార్యాలయం రూ.23,428, కంటోన్మెంట్ సీఈఓ రూ.24,700, డాక్టర్లు, సోషల్ వర్కర్ల పేర్లు కూడా ఉన్నాయి.
ఈ జాబితాతో పాటు ప్రతి ఒక్కరు తమ బిల్లులను చెల్లించాలని విద్యుత్ శాఖ కోరింది. లేనిపక్షంలో బిల్లు చెల్లించని వారి విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని హెచ్చరించింది. అయితే డివిజన్‌లో 91 వేల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని, వారిలో 67 వేల మంది మాత్రమే బిల్లులు చెల్లించారని విద్యుత్ శాఖ ఇంజినీర్ ఎస్‌కే సింహ తెలిపారు. దాంతో పాటుగా ప్రతి ఒక్కరూ తమ బిల్లును చెల్లించాలని లేకుంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు.