కరోనాను జయించడానికి ఎయిర్‌పోర్టులో పూజలు
భోపాల్: కరోనా మహమ్మారిని జయించడానికి మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ఇండోర్ ఎయిర్‌పోర్టులో పూజలు నిర్వహించారు. దేవి అహిల్యబాయి హోల్కర్ విగ్రహం ముందు ఆమె చప్పట్లు కొడుతూ, మంత్రాలు పఠిస్తూ పూజ చేశారు. ఇందులో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆర్యమా సన్యాస్, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. కరోనాను అంతమొందించాలని ఆమె చేసిన ఈ పూజలో మాస్కు ధరించకపోవడం గమనార్హం. శుక్రవారం నిర్వహించిన ఈ పూజా వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. గతంలోనూ […]
భోపాల్: కరోనా మహమ్మారిని జయించడానికి మధ్యప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ ఇండోర్ ఎయిర్‌పోర్టులో పూజలు నిర్వహించారు. దేవి అహిల్యబాయి హోల్కర్ విగ్రహం ముందు ఆమె చప్పట్లు కొడుతూ, మంత్రాలు పఠిస్తూ పూజ చేశారు. ఇందులో ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఆర్యమా సన్యాస్, ఇతర సిబ్బంది కూడా పాల్గొన్నారు. కరోనాను అంతమొందించాలని ఆమె చేసిన ఈ పూజలో మాస్కు ధరించకపోవడం గమనార్హం.
శుక్రవారం నిర్వహించిన ఈ పూజా వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నది. గతంలోనూ ఆమె తరచూ మాస్కు ధరించేవారు కాదని విమర్శకులు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాస్కు ఎందుకు ధరించట్లేదని ప్రశ్నించగా, తాను రోజూ హోమాలు చేస్తుంటారని, హనుమాన్ చాలీసా పఠిస్తారని, కాబట్టి మాస్కు ధరించడం తనకు అవసరం లేదని వివరణ ఇచ్చారు. ఆవు పేడ పిడకలను మండిస్తే వచ్చే పొగ ఇంటిని 12 గంటలపాటు కరోనా దరిచేరకుండా పరిశుభ్రంగా ఉంచుతందనీ సెలవిచ్చారు.