ఎల్ఆర్ఎస్‌తో టీఆర్ఎస్ ఖాళీ !

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్‌తో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో ఔషధనగరి వ్యతిరేక సభకు హాజరైన ఎంపీ కోమటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి బతుకులు వస్తాయని అనుకున్నాం కానీ.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే గ్రామాలపై పడి.. దోచుకు తింటున్నారని విమర్శించారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని […]

Update: 2020-10-11 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్‌తో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారంలో ఔషధనగరి వ్యతిరేక సభకు హాజరైన ఎంపీ కోమటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే మంచి బతుకులు వస్తాయని అనుకున్నాం కానీ.. భూములు లాక్కొని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే గ్రామాలపై పడి.. దోచుకు తింటున్నారని విమర్శించారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే దాకా ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఫార్మాసిటీ శాపంగా మారిందని, గతంలో చౌటుప్పల్ ఏరియాలో ఫార్మా కంపెనీలు పెట్టడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రైతులకు రూ.12లక్షలు ఇచ్చి కంపెనీలకు రూ.కోట్లకు అమ్ముకుంటున్నారన్నారు. గ్రీన్ ఫార్మా సిటీపై కేసు వేస్తానని తెలిపారు. ఫార్మాసిటీతో నేల, గాలి, నీరు కలుషితం అవుతుందన్నారు.

Tags:    

Similar News