నోటికొచ్చింది మాట్లాడడం కేసీఆర్‌కు అలవాటు
దిశ, భువనగిరి: కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ సర్కా ర్ విఫలమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలకు ఎంపీ కోమటిరెడ్డి హాజరయ్యారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ… ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకోవడం తప్పా, ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టవని అన్నారు. కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతానని, జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రకటించి ఆదుకుంటానని […]
దిశ, భువనగిరి: కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో టీఆర్ఎస్ సర్కా ర్ విఫలమైందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇంచార్జి, బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల ఐలయ్య జన్మదిన వేడుకలకు ఎంపీ కోమటిరెడ్డి హాజరయ్యారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ… ప్రాజెక్టుల్లో కమీషన్లు దండుకోవడం తప్పా, ప్రజా సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పట్టవని అన్నారు.
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చుతానని, జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ప్రకటించి ఆదుకుంటానని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నోటికొచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఇచ్చిన వాటిని వెంటనే మర్చిపోవడం కేసీఆర్‌కు పరిపాటిగా మారిందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్లకు తీసుకొస్తే కొనే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యం దొరక‌్క కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్స కోసం భూములు, బంగారం అమ్ముకుని రోడ్డునపడుతున్నారని తెలిపారు.
కరోనా విస్తరిస్తోన్న ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న యాదగిరిగుట్ట వీహెచ్‌సీ సిబ్బందికి నూతన వస్త్రాలు, మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, కరోనా కిట్ అందజేశారు. అనంతరం బీర్ల ఐలయ్య బహుకరించిన ఉచిత అంబులెన్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక ఎంపీపీ చీర శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.