రాజకీయాలకు అతీతంగా సేవ చేద్దాం : బండి సంజయ్
దిశ ప్రతినిధి, కరీంనగర్: భారీ వర్షాలకు కరీంనగర్‌లోని చాలా కాలనీలు అతలాకుతలం అయ్యాయని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బాధితులను ఆదుకోవడానికి రాజకీయాలకు అతీతంగా సేవచేసేందుకు ముందు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ సిటీలోని పలు కాలనీల్లో బండి సంజయ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విపక్షాలు చేసే సూచనలను, ప్రభుత్వం విమర్శలుగా భావించవద్దన్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు. ఇళ్ల మధ్యకు వర్షం […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: భారీ వర్షాలకు కరీంనగర్‌లోని చాలా కాలనీలు అతలాకుతలం అయ్యాయని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బాధితులను ఆదుకోవడానికి రాజకీయాలకు అతీతంగా సేవచేసేందుకు ముందు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ సిటీలోని పలు కాలనీల్లో బండి సంజయ్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విపక్షాలు చేసే సూచనలను, ప్రభుత్వం విమర్శలుగా భావించవద్దన్నారు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోతే ప్రజలే నిలదీస్తారని హెచ్చరించారు.
ఇళ్ల మధ్యకు వర్షం నీరు చేరి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు బండి సంజయ్‌కు వివరించారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగానే ఈ పరిస్థితి తయారైందన్నారు. కరీంనగర్ కార్పొరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీతో పాటు వివిధ అభివృద్ధి పథకాల కింద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని చెప్పారు. వీటిని ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయాల్సిన అవసరముందని, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ముంపు సమస్యను అధిగమించేందుకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరముందన్నారు. దెబ్బ తిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు.