హరీష్ రావు VS బండి సంజయ్@ ఓ అగ్గిపెట్టె

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, పసుపు బోర్డు, ఐటీఐఆర్ లాంటివి రాష్ట్రానికి రాకుండా పోవడానికి స్టేట్ బీజేపీ లీడర్లే కారణమని ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఇతర మంత్రులు మండిపడ్డారు. వీరి చేతగానితనం వల్లే కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, […]

Update: 2021-03-26 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార టీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, పసుపు బోర్డు, ఐటీఐఆర్ లాంటివి రాష్ట్రానికి రాకుండా పోవడానికి స్టేట్ బీజేపీ లీడర్లే కారణమని ముఖ్యమంత్రితో పాటు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఇతర మంత్రులు మండిపడ్డారు. వీరి చేతగానితనం వల్లే కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలు, మంత్రుల వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నష్టం వాటిల్లేలా ఏపీ ప్రభుత్వం నిర్మి్స్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలనే తానే కేంద్రానికి లేఖ రాసినట్లు బండి చెప్పుకొచ్చారు. దీనిపై కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదారి పట్టించారని, ఈ విషయాన్ని స్పీకర్ ఓం బిర్లా కరోనా నుంచి కోలుకున్నాక ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తానని అన్నారు.

మంత్రి హరీష్ రావుపై సెటైర్లు..

అసెంబ్లీలో హరీష్ రావు చాలా అబద్ధాలు మాట్లాడుతున్నారని.. హరీష్‌కు అంటేనే కేరాఫ్ ‘అబద్ధమని’ అన్నారు. ఉద్యమ సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్‌కు ఇంకా అగ్గిపెట్టె దొరకుతలేదటా..? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతచారికి అగ్గిపెట్టె దొరుకుతుందని గానీ.. హరీష్ రావు ఎందుకు దొరకదో..? సమాధానం చెప్పాలన్నారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News