అక్కడికి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారు : బండి

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు పెరుగుతుండటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకపడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా నియంత్రణపై చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి ఒక్కసారి మాత్రమే వెళ్లారని, అదే తమ పార్టీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికి ఏడు సార్లు గాంధీ ఆస్పత్రిని సందర్శించారని గుర్తుచేశారు. కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఏం సాధించారని వ్యాఖ్యానించారు. కరోనా […]

Update: 2021-05-20 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో లాక్‌డౌన్ విధించినా కరోనా కేసులు పెరుగుతుండటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకపడ్డాడు. రాష్ట్ర ప్రభుత్వానికి కరోనా నియంత్రణపై చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి ఒక్కసారి మాత్రమే వెళ్లారని, అదే తమ పార్టీ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికి ఏడు సార్లు గాంధీ ఆస్పత్రిని సందర్శించారని గుర్తుచేశారు.

కేసీఆర్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఏం సాధించారని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడికి కోసం తెలంగాణలో నియమించిన టాస్క్‌ఫోర్స్ కమిటీని ఒక దొంగల ముఠాగా ఎంపీ బండి సంజయ్ అభివర్ణించారు. రాష్ట్రంలో అసలు వ్యాక్సినేషన్ ఎందుకు నిలిపివేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సడన్‌గా కేసీఆర్ కొవిడ్ ఆస్పత్రుల టూర్ వేశారని, ఎంజీఎం ఆస్పత్రికి ఈరోజు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అన్ని అరెంజ్‌మెంట్స్ చేశాక రేపు వెళ్లడం ఎంటనీ అడిగారు.

Tags:    

Similar News