నిరసన సెగలు.. బండి VS ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో కోదాడ వద్ద బండి సంజయ్ వాహనాన్ని జై భీమ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వేరోస్, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌‌‌కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా యాచారంలో స్వేరోస్, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. స్వేరోస్ పై చర్చకు సిద్ధమని దళిత బహుజన అభ్యుదయ సేన […]

Update: 2021-03-17 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సూర్యాపేటకు వెళ్తున్న క్రమంలో కోదాడ వద్ద బండి సంజయ్ వాహనాన్ని జై భీమ్ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్వేరోస్, గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్‌‌‌కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో పాటు రంగారెడ్డి జిల్లా యాచారంలో స్వేరోస్, దళిత సంఘాలు నిరసన ప్రదర్శనలు చేశాయి. స్వేరోస్ పై చర్చకు సిద్ధమని దళిత బహుజన అభ్యుదయ సేన బీజేపీకి సవాల్ విసిరింది.

అంతకుముందు పెద్దపల్లి జిల్లాలోని ధూళికట్టలో జరిగిన ఓ కార్యక్రమంలో హిందూ దేవుళ్లు, దేవతలకు వ్యతిరేకంగా స్వేరోస్ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. అందులో గురుకులాల సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం పాల్గొన్నారు. దీనిపై హిందూ సంఘాలతో పాటు బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగంలో బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న వ్యక్తి వివాదాస్పద ప్రతిజ్ఞ ఎలా చేస్తారంటూ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. స్వేరోస్ పేరిట ఓ సామాజిక వర్గంపై ప్రవీణ్ కుమార్ దళితులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు.

స్వేరోస్ సంస్థకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఒకే పోస్టులో ఎక్కువ రోజులు ఒకే అధికారిని ఎలా కొనసాగిస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అంతేకాకుండా, స్వేరోస్‌పై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాగా, ధూళికట్ట ప్రతిజ్ఞలో పాల్గొన్న బౌద్ధ ఫ్యామిలీకి తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఎవరి మనోభావాలను అయిన కించపరిస్తే ‘క్షమించండి’ అంటూ గురుకులాల కార్యదర్శి సంజాయిషీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News