వాళ్ల మెడలు వంచిందెవరో బీజేపీ నేతలే చెప్పాలి: MP లింగయ్య యాదవ్

దిశ, మిర్యాలగూడ: రైతు వ్యతిరేక సాగు చట్టాలను ఉపసంహారించుకోవడం ద్వారా మెడలోంచిందెవరో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ దుయ్యబట్టారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చట్టాల రద్దు కోరుతూ ఏడాదికి పైగా రైతులు సాగించిన పోరాటమే విజయంగా అభివర్ణించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో రైతు […]

Update: 2021-11-20 06:26 GMT

దిశ, మిర్యాలగూడ: రైతు వ్యతిరేక సాగు చట్టాలను ఉపసంహారించుకోవడం ద్వారా మెడలోంచిందెవరో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ దుయ్యబట్టారు. శనివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కర్ రావు తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగు చట్టాల రద్దు కోరుతూ ఏడాదికి పైగా రైతులు సాగించిన పోరాటమే విజయంగా అభివర్ణించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయని అన్నారు.

ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన మహాధర్నాతో దక్షిణాదిలో ఉద్యమం ఉధృతమైతే రాజకీయంగా దెబ్బని గ్రహించిన మోదీ అప్రమత్తమయ్యారని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం దొంగాట కట్టిపెట్టి రైతులకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. ఖరీఫ్ తో పాటు రబీ సీజన్లో వడ్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని కోరారు.

Tags:    

Similar News