AP News: వైఎస్ వివేకా హత్యకేసు: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ తండ్రి
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరింత వేగవంతమైంది. మంగళవారం 72వ రోజు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించిన సీబీఐ అధికారులు తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారించారు. మంగళవారం ఉదయం వైఎస్ భాస్కర్‌రెడ్డి కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. మరోవైపు జగదీశ్వర్‌రెడ్డి, భరత్ కుమార్‌లను కూడా […]
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరింత వేగవంతమైంది. మంగళవారం 72వ రోజు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను విచారించిన సీబీఐ అధికారులు తాజాగా వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారించారు. మంగళవారం ఉదయం వైఎస్ భాస్కర్‌రెడ్డి కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అనంతరం ఆయనను సీబీఐ అధికారులు విచారించారు.
మరోవైపు జగదీశ్వర్‌రెడ్డి, భరత్ కుమార్‌లను కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. జగదీశ్వర్‌రెడ్డి..మాజీమంత్రి వైఎస్ వివేకాపొలం పనులు చూసుకునేవాడు. భరత్ కుమార్ మాత్రం సునీల్ కుమార్ యాదవ్ సమీప బంధువు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.