షూటింగ్ సమయంలో గర్భం దాల్చిన ఆ హీరోయిన్... దాచేందుకు అష్టకష్టాలు పడిన డైరెక్టర్.. ఎందుకో తెలిస్తే షాక్...

లెజెండరీ హీరోయిన్ జీనత్ అమన్ తన కెరీర్ లో జరిగిన విషయాలను తరుచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే 1987లో వచ్చిన ' డాకు హసీనా ' మూవీ గురించి పంచుకుంది. రాకేష్ రోషన్, రజనీకాంత్ కీలక పాత్రల్లో

Update: 2024-07-13 14:46 GMT

దిశ, సినిమా: లెజెండరీ హీరోయిన్ జీనత్ అమన్ తన కెరీర్ లో జరిగిన విషయాలను తరుచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే 1987లో వచ్చిన ' డాకు హసీనా ' మూవీ గురించి పంచుకుంది. రాకేష్ రోషన్, రజనీకాంత్ కీలక పాత్రల్లో నటించిన సినిమాలో.. తల్లిదండ్రులను చంపిన గ్రామ పెద్దలపై రివేంజ్ తీసుకునే పాత్రలో కనిపించింది జీనత్. రజినీకాంత్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆమె ఎలా మారింది? రాకేష్ రోషన్ కు ఆమెకు సంబంధం ఏంటి? అనేది స్టోరీ.

అయితే ఈ మూవీ స్టార్ట్ అయ్యాక కొద్ది రోజులకే తను పొట్టతో ఉన్నానని తెలుసుకుందట జీనత్. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పగా.. తనను రీప్లేస్ చేసే ప్రసక్తే లేదని అలాగే చిత్రీకరణ కంటిన్యూ చేశారట. తన పొట్ట పైకి కనిపించకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పిన ఆమె.. ఈ క్రమంలో చాలా షాట్స్ తన స్టమక్ కవర్ కాకుండా ఉంటాయని చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన బిహైండ్ ది సీన్స్ పిక్స్ కూడా పంచుకుంది.



Similar News