పీపుల్ మీడియాకు శ్వాగ్‌తో హిట్ దక్కుతుందా?
తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి దూసుకొచ్చిన అనతి కాలంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన సంస్థగా పీపుల్ మీడియా (People media factory) సంస్థకు పేరుంది.
తెలుగు సినిమా నిర్మాణ రంగంలోకి దూసుకొచ్చిన అనతి కాలంలోనే అత్యధిక సినిమాలు నిర్మించిన సంస్థగా పీపుల్ మీడియా (People media factory) సంస్థకు పేరుంది. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. తక్కువ కాలంలోనే 100 సినిమాలు నిర్మించిన సంస్థగా పేరు తెచ్చుకోవాలనేది ఈ సంస్థ లక్ష్యమట. టీజీ విశ్వప్రసాద్ (TG Vishwa Prasad) ఈ సంస్థకు నిర్మాత. సాఫ్టవేర్ రంగం నుంచి సినిమా రంగంలోకి వచ్చిన టీజీ విశ్వప్రసాద్ వరుసగా సినిమాలు నిర్మించాలనే లక్ష్యంతో సరైన కథలను ఎంచుకోకుండా ఇప్పటి వరకు ఎక్కువ ఫ్లాప్‌లనే మూటగట్టుకున్నాడు. సొంతంగా ఈ సంస్థ నిర్మాణంలో జరిగిన ధమాకా, రాజ రాజ చోర మినహా ఈ సంస్థకు పెద్ద విజయాలేమి లేవు. దాదాపుగా 25 సినిమాలు నిర్మిస్తే అందులో ఈ సంస్థకు దక్కినవి కేవలం రెండు విజయాలు మాత్రమే. ఇతర సంస్థల భాగస్వామ్యలో నిర్మించిన కార్తికేయ-2, ఓ బేబి, గూఢాచారి లాంటి విజయాల్లో వీరి బ్యానర్ కూడా వున్నా ఈ చిత్రాల సక్సెస్‌తో ఈ సంస్థకు ఫైనాన్షియల్‌గా పెద్దగా వచ్చినా లాభాలేమీ లేవు. ఇటీవల మిస్టర్ బచ్చన్‌తో 2024లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను మూటగట్టుకుంది. తాజాగా ఈ సంస్థ నుంచి రాబోతున్న చిత్రం శ్వాగ్. శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం బోల్డ్ కంటెంట్‌తో తీసిన చిత్రంలా అనిపిస్తుంది. ట్రయిలర్ చూస్తుంటే ఈ చిత్రం ఫ్యామిలీతో చూడదగ్గ చిత్రంలా లేదని కొంత ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు దూరంగా వుంటారనేది కాదనలేని నిజమని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు..ఈ ట్రయిలర్‌లోనే హీరోయిన్ రీతూ వర్మతో పురుషాంగానికి పాకులాట ఎక్కువ అనే డైలాగ్ చెప్పించడం చూస్తే ఈ సినిమా ఎంతటి బోల్డ్‌గా వుండబోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా సంస్థ ఇలాంటి బోల్డ్ కంటెంట్‌తో సినిమా నిర్మించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పీపుల్ మీడియా సంస్థకు చాలా కాలం నుండి ఊరిస్తున్న హిట్ దక్కతుందో లేదో చూడాలి..