అక్కినేని అఖిల్ అంటే ఉపాసనకి ఎందుకు అంత కోపం.. కారణం అదేనా!
‘సిసింద్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ అందరికీ సుపరిచితమే.
దిశ, సినిమా: ‘సిసింద్రి’ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ అందరికీ సుపరిచితమే. తన మొదటి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక స్టార్ హీరో అవుతాడు అనుకుంటే తన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ అని ఆఫర్లు రావడమే ఆగిపోయాయి. అఖిల్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అది అందరికీ తెలిసిన విషయమే . అమల - నాగార్జున సైతం అఖిల్ బిహేవియర్ కి కోప్పడుతూ ఉంటారు. అఖిల్ తీసుకున్న కొన్ని కొన్ని డెసిషన్స్ అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా నచ్చవు అన్న కామెంట్స్ వినిపించాయి . అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కి కూడా అఖిల్ అంటే పీకల్లోతు కోపం ఉంది అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది.
ఉపాసన జాన్ జిగిరి దోస్త్ శ్రేయ భూపాల్.. అఖిల్ ప్రేమించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రేకప్ కూడా చెప్పుకున్నారు. దానికి కారణం అఖిల్ మొండి బిహేవియర్. ఆ తర్వాత శ్రేయ భూపాల్ చాలా డిప్రెషన్ కు గురై ఎన్నో ట్రీట్మెంట్స్ కూడా తీసుకుందట. అది కళ్ళారా చూసిన ఉపాసన పరోక్షంగా అఖిల్ పై కోపం పెంచుకుని ఎక్కడ కనిపించిన సరే అఖిల్ తో మాట్లాడను కూడా మాట్లాడదట. అలా ఆ కారణంగా అఖిల్ అంటే ఉపాసనకి కోపం అని తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.